రొమేనియా తిరుగుబాటుకు ప్రతీకగా భారీ మార్చ్ రొమేనియన్ అధ్యక్షుడు క్లాస్ ఐహాన్నిస్, ప్రధాన మంత్రి లుడొవిక్ ఓర్బన్ సహా ప్రజలందరూ కలిసి రాజధాని బుకారెస్ట్‌లో ఆదివారం భారీ మార్చ్ నిర్వహించారు. 1989లో కమ్యూనిస్ట్ నాయకుడు నికొలే సెసెస్క్యూ పాలనపై తిరుగుబాటుకు చేసి ప్రాణాలు వీడిన వారిని స్మరిస్తూ వేలాది ప్రజలు మార్చ్‌లో పాల్గొన్నారు. అమరులకు ఘన నివాళులు అర్పించారు. తెల్ల బుడగలు గాల్లోకి వదులుతూ, కొవొత్తులు, పూలు, అతి పెద్ద జాతీయ జెండాతో మార్చ్ చేపట్టారు.
ఇదీ జరిగింది
1989లో డిసెంబర్ 16వ తేదీన తిమిసోరా ప్రాంతంలో నివసిస్తున్న హంగేరియన్ పాస్టర్, లాస్జ్లొ టోకీస్ అనే ఇద్దరు వ్యక్తులను అధికారులు బలవంతంగా నగర బహిష్కరణ చేసినందుకు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు ప్రజలు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ పోరాటంలో సైన్యం, రహస్య సిబ్బంది కలిసి ఆందోళనకారులపై కాల్పులు జరిపి 1100 మందిని చంపేశారు. అనంతరం కమ్యూనిస్టు నియంత నికోలె సెసెస్క్యూ, ఆయన సతీమణి ఎలెనాను డిసెంబర్ 25వ తేదీన బుకారెస్ట్‌లో ఆందోళనకారులు ఉరి తీశారు. పాలకుడు నికోలె మృతితో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. ఈ తిరుగుబాటును స్మరిస్తూ రొమేనియాలో ఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి : శబరిమలలో ఘనంగా కర్పూరారి మహాత్సవం