మాస్కు ఏ సామాగ్రితో తయారైందన్న దాని కంటే... సరిగ్గా ధరిస్తున్నామా? లేదా? అన్నదే చాలా ముఖ్యమని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు. ముసుగును సరిగ్గా ధరించడం ద్వారానే మహమ్మారి నుంచి అధిక రక్షణ పొందవచ్చని సూచించారు. కరోనా నుంచి ఏయే మాస్కులు ఎంత సమర్థంగా మానవాళికి రక్షణ కల్పిస్తాయన్న విషయమై వారు ఇటీవల పరిశోధన సాగించారు. ఇందులో భాగంగా ఏడుగురు వ్యక్తులకు వివిధ రకాల మాస్కులను ధరింపజేసి... వాటికి దారుఢ్య పరీక్ష నిర్వహించారు. ఎన్-95 మాస్కును ముఖంపై ఖాళీలూ లేకుండా, సరిగ్గా ధరించడం ద్వారా.. గాలి తుంపప్లను 95 శాతం వరకూ అడ్డుకోవచ్చని తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను 'పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్(పీఎల్వోఎస్)-వన్' పత్రిక అందించింది.
'మాస్కు సరిగ్గా ధరిస్తేనే... సంపూర్ణ రక్షణ' - mask is the main protection from corona virus cambridge univesity
మాస్కును సరిగ్గా ధరిస్తేనే కరోనా నుంచి సంపూర్ణ రక్షణ పొందవచ్చని సూచించారు కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయ పరిశోధకులు. మాస్కు ఏ సామాగ్రితో తయారైందన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. కరోనా నుంచి ఏయే మాస్కులు ఎంత సమర్థంగా మానవాళికి రక్షణ కల్పిస్తాయన్న విషయమై వారు ఇటీవల పరిశోధన సాగించారు.
"అత్యంత ప్రభావంగా పనిచేసే ఎన్95, కేఎన్95, ఎఫ్ఎఫ్పీ2 మాస్కులను సరిగ్గా ధరించకపోతే... వాటి వల్ల అంతగా ఉపయోగం ఉండదు. సాధారణ మాస్కు అయినప్పటికీ ముక్కు, నోరు పూర్తిగా కప్పేలా ధరించడం వల్ల వైరస్ నుంచి అధిక ప్రయోజనం పొందవచ్చు. ముఖానికీ, మాస్కుకూ మధ్య ఖాళీలు లేకుండా చూసుకోవాలి. లేకుంటే... మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు వెలువడే తుంపర్లు మాస్కు పైభాగంలోని ఖాళీల ద్వారా బయటకు వెళ్తాయి." అని పరిశోధనకర్త యూజీనియా ఒకెల్లీ సూచించారు.
ఇదీ చదవండి :80.5 లక్షల టీకా డోసుల పంపిణీ: కేంద్రం