తెలంగాణ

telangana

ETV Bharat / international

'తగ్గేదేలే!'.. లొంగిపోవాలన్న రష్యా డిమాండ్​ను లైట్​ తీసుకున్న ఉక్రెయిన్

Mariupol Ukraine News: ఉక్రెయిన్​ పోర్టు నగరం మరియుపోల్​లోని బలగాలు ఆయుధాలు కిందపడేసి.. లొంగిపోవాలన్న రష్యా డిమాండ్​ను ఉక్రెయిన్​ తిరస్కరించింది. ఉక్రెయిన్ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని ఆ దేశ ఉపప్రధాని ఇరినా వెరెశ్​చక్ తేల్చిచెప్పారు.

Sumy Ukraine News
Sumy Ukraine News

By

Published : Mar 21, 2022, 4:09 PM IST

Updated : Mar 21, 2022, 4:41 PM IST

Mariupol Ukraine News: ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రను కొనసాగిస్తోంది. పోర్టు నగరమైన మరియుపోల్​లో రష్యా బలగాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో మరియుపోల్​లోని ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు కిందపడేసి.. నగరం విడిచి వెళ్లిపోవాలన్న పుతిన్ సేనల డిమాండ్​ను ఆ దేశం వ్యతిరేకించింది. ఉక్రెయిన్ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని ఉపప్రధాని ఇరినా వెరెశ్​చక్ స్పష్టం చేశారు. రష్యాకు కూడా ఇదే విషయాన్ని చెప్పామన్నారు. మాస్కో విధించిన డెడ్​లైన్​ను ముందుగానే వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

ఉక్రెయిన్​లో యుద్ధం కారణంగా నిరాశ్రయులపై ప్రజలు

మరియుపోల్ మేయర్ పియోటర్ ఆండ్రీషెన్కో కూడా రష్యా ఆఫర్​ను తిరస్కరించారు. ఈ మేరకు ఫేస్​బుక్​లో ఓ పోస్టు చేశారు. రష్యా విధించిన డెడ్​లైన్ కంటే ముందే ఈ డిమాండ్​ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్​లోని షాపింగ్ సెంటర్​పై రష్యా జరిపిన దాడిలో 8 మంది మృతిచెందారు.

రష్యా దాడిలో పూర్తిగా దగ్ధమైన వాహనాలు

అంతకుముందు మరియుపోల్ నగరంలోని ఆర్ట్ స్కూల్​పై రష్యా బలగాలు బాంబు దాడులకు పాల్పడ్డాయి. దాడి సమయంలో పాఠశాలలో దాదాపు 400 మంది శరణార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే దాడి తర్వాత పరిస్థితిపై మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఇదే విషయాన్ని వీడియో ద్వారా తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ. పాఠశాల దాడిలో ఎంతమంది సజీవంగా ఉన్నారో స్పష్టత లేదన్నారు.

ఉక్రెయిన్​లోని ఓ నగరంలో యుద్ధవాతావరణం

సుమీ కెమికల్ ప్లాంటులో అమ్మోనియా లీక్..

Sumy Ukraine News: తూర్పు ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. రష్యా వైమానిక దళం జరిపిన బాంబు దాడుల్లో సుమీఖింపోరమ్‌ రసాయన ప్లాంట్‌ నుంచి అమ్మోనియా లీక్ అయిందని అధికారులు పేర్కొన్నారు. ప్లాంటుకు దాదాపు 5 కిలోమీటర్ల మేర అమ్మోనియా ప్రభావం ప్లాంటు కిలోమీటర్ల దూరం ఉంటుందని సుమీ గవర్నర్‌ ఓబ్లాస్ట్‌ మిత్రో తెలిపారు.

ఉక్రెయిన్​పై రష్యా దాడిలో పూర్తిగా నేలమట్టమైన భవనం

రసాయన పరిశ్రమకు సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిట్రిక్ యాసిడ్‌లో ముంచిన వస్త్రాలను ముక్కుకు అడ్డుగా ఉంచుకుని శ్వాస తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచనలు చేశారు. ప్లాంటు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 2,63,000 మంది నివసిస్తున్నారు.

దాడిలో పూర్తిగా దగ్ధమైన భవనం

రష్యా నౌకాదళ కమాండర్ మృతి..

రష్యాలోని బ్లాక్​సీ ఫ్లీట్​కు చెందిన సీనియర్ నౌకాదళ కమాండర్ ఆండ్రీ పాలీ.. ఉక్రెయిన్​ మరియుపోల్​లోని యుద్ధంలో మృతిచెందారు. ఈ విషయాన్ని సేవస్టోపోల్ పోర్ట్ సిటీ గవర్నర్ మైఖేల్ రాజోజయేవ్ తెలిపారు.

ఇవీ చూడండి:

నర్సింగ్​హోంపై రష్యా ట్యాంకర్ దాడిలో 56కు చేరిన మృతులు

'ఆహారం, నీళ్లు ఇవ్వండి ప్లీజ్'.. బతిమలాడుతున్నా కరుణించని రష్యా సైన్యం

Last Updated : Mar 21, 2022, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details