తెలంగాణ

telangana

ETV Bharat / international

మలాశయంలో ఇరుక్కున్న ఫిరంగి గుండు- బాంబ్​ స్క్వాడ్​ సాయంతో చికిత్స

ఓ వ్యక్తి మలాశయంలో టాయిలెట్​ జెట్​ స్ప్రేయర్​ ఇరుక్కున్న సంఘటన ఇటీవల కర్ణాటకలో చూశాం. ఇప్పుడు అలాంటి సంఘటనే ఇంగ్లాండ్​లోని గ్లూసెస్టర్​లో జరిగింది. ఇక్కడ ఫిరంగి గుండు అతడి మలాశయంలోకి వెళ్లడం గమనార్హం. బాధితుడికి సాయం చేసేందుకు.. ఏకంగా బాంబ్​ స్క్వాడ్ వెళ్లడం విశేషం.

Man seeks medical help after artillery shell lodged rectum
మలాశయంలో ఇరుక్కున్న ఫిరంగి గుండు

By

Published : Dec 3, 2021, 6:35 PM IST

ఓ వ్యక్తి హడావుడిగా ఆస్పత్రికి చేరుకున్నాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే.. ఏమైందని అడగ్గా అతడు చెప్పిన సమాధానం విని షాకయ్యారు వైద్యులు. అతడి మలాశయంలో ఓ ఫిరంగి గుండు(బాంబ్​ షెల్​) ఇరుక్కుంది మరి.

ఇంగ్లాండ్​ గ్లూసెస్టర్​లోని గ్లూసెస్టర్​ షైర్​ రాయల్ ఆస్పత్రి వద్ద జరిగిందీ సంఘటన.

ఓ ప్రైవేటు ఆయుధశాల శుభ్రపరుస్తుంటే జారి షెల్​పై పడగా.. అది మలాశయంలోకి చొచ్చుకుపోయిందని బాధితుడు చెప్పాడు.

కంగారుపడ్డ వైద్యులు.. అతడిని అత్యవసర విభాగానికి తరలించారు. దాదాపు 2 అంగుళాల పరిమాణం ఉన్న ఆ షెల్​ను తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. ప్రత్యేక నిపుణుడి సలహా తీసుకున్నారు.

రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బందికి ఎలాంటి ప్రమాదం కలగకుండా.. ప్రోటోకాల్​ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.

బాంబ్​ స్క్వాడ్​ కూడా..

కేసు గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. వారి ద్వారా ఈ విషయం రక్షణ శాఖకు చేరగా.. ముందు జాగ్రత్తగా బాంబ్​ స్క్వాడ్​ను కూడా తరలించారు అధికారులు.

ప్రైవేటు ఆయుధశాల తనదేనని ఓ మిలిటరీ కలెక్టర్​ వివరించారు. బాధితుడు శుభ్రం చేస్తూ పడిపోవడం వల్లే.. 80 ఏళ్ల నాటి ఆ పేలుడు పదార్థం అతడి మలాశయంలో ఇరుక్కుపోయిందని వైద్యులకు చెప్పారు.

పాత జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకునేందుకే.. మిలిటరీ కలెక్టర్​ ఆయుధాలను సేకరించారని తెలుస్తోంది. ఈ రెండు అంగుళాల బాంబ్​ షెల్ కూడా రెండో ప్రపంచ యుద్ధం నాటిదే.

ఇదీ చూడండి:మలాశయంలో ఇరుక్కున్న టాయిలెట్​ స్ప్రేయర్​​- చివరకు...

ABOUT THE AUTHOR

...view details