తెలంగాణ

telangana

ETV Bharat / international

మ్యూజియంలో అనుమానిత ఉగ్రవాది కలకలం

ఓ ఆగంతుకుడు అనుమానాస్పదంగా మ్యూజియంలోకి ప్రవేశించడం వల్ల దక్షిణ ఫ్రాన్స్​లోని నీస్​ నగరం ఉలిక్కిపడింది. మ్యూజియం గోడలపై అరబ్​ భాషలో బెదిరింపు సందేశాలు కనపడటం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

మ్యూజియంలో అనుమానిత ఉగ్రవాది కలకలం

By

Published : Oct 23, 2019, 2:44 PM IST

దక్షిణ ఫ్రాన్స్​లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీస్​లోని మ్యూజియంలోకి ఓ వ్యక్తి చొరబడడం కలకలం సృష్టించింది. దీనితో పాటు మ్యూజియం గోడల మీద అరబిక్​ భాషలో బెదిరింపు సందేశాలు దర్శనమివ్వడం వల్ల స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందిన వెంటనే మ్యూజియాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

అర్ధరాత్రి సమయంలో ఆగంతుకుడు సెయింట్​-రాఫెల్​ పట్టణంలోని మ్యూజియంలో ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరో వ్యక్తి కూడా ఉండి ఉంటాడని అనుమానిస్తున్నారు. తమతో మాట్లాడేందుకు ఆ వ్యక్తి నిరాకరించినట్టు వివరించారు.

'మ్యూజియాన్ని నరకంలా మారుస్తాం...' అన్న సందేశాలు ఓ గోడపై కనపడ్డాయి. అయితే ఆ వ్యక్తి వద్ద ఆయుధాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై స్పష్టత లేదు.
ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యూజియం సమీపానికి వెళ్లకూడదని ప్రజలకు ట్విట్టర్​ ద్వారా సూచించారు.

ఇదీ చూడండి:-అమెరికాకు రెండోసారీ చిక్కని విక్రమ్

ABOUT THE AUTHOR

...view details