టేట్ మోడ్రన్ ఎగ్జిబిషన్‌లోని ఆ గది రకరకాల కళాఖండాలతో నిండి ఉంటుంది. దశాబ్దాల నాటి గతిశక్తి కళకు ప్రాణంపోస్తూ రకరకాల కళాఖండాలు అక్కడ దర్శనమిస్తాయి. గతిశక్తి ద్వారా వినసొంపైన శబ్దాలను సృష్టించడం వీటి ప్రత్యేకత. కళకు, విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతూ వీటి ప్రదర్శన సాగుతోంది.
ఈ ప్రాచీన కళను అందరూ చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేయాలనే పనయోటిస్ వాస్సిలాకిస్ ఆలోచన నుండి గతికళ (కైనటిక్ ఆర్ట్) పుట్టింది. ఈ కళకు ఆజ్యం పోసిన ఆయన టాకిస్ పేరుతో ప్రఖ్యాతి గాంచారు. ఎగ్జిబిషన్ గదిలో కనిపిస్తున్నవి ఆయన కళా నైపుణ్యాలే.
ఒక కళాకారుడిగా నేను చెప్పేదేంటంటే... ఈ కళకు సంప్రదాయంగా ఉన్న సరిహద్దులను చెరిపేసి ఇతను కొత్త రూపాన్ని ఇచ్చారు. ఏథెన్స్లో ప్రాచీన కళను చూస్తూ పెరిగినట్లున్నారాయన. ఇతను ఆ కళను కలకాలం నిలిచిపోయేలా చేయాలనుకున్నారు.