తెలంగాణ

telangana

ETV Bharat / international

జూలో జంతువులకు ఆ కొలతలు- ఎందుకంటే? - పెంగ్విన్

మంచి పొడుగు, సరైన బరువు, ఆకట్టుకునే శరీర రంగు, ముఖానికి ఉన్న అందం.. మనిషి సౌందర్యాన్నివర్ణించడానికి ఉపయోగించే కొలమానాలు. పొడుగు.. దానికి తగ్గ బరువును సరైన ఆరోగ్యానికి సూచికలుగా కూడా చెబుతారు. ఆరోగ్యం మనుషులకేనా, మా జంతువులు, పక్షులకు కూడా అంటోంది లండన్‌ జంతు ప్రదర్శనశాల. అక్కడి జంతువుల బరువు, పొడుగును ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వాటి ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటిస్తోంది.

london zoo animals
జంతువుల కొలతలు

By

Published : Aug 28, 2021, 12:37 PM IST

జంతువుల కోసం లండన్ జూలో బరువు యంత్రాలు

ప్రపంచంలోని అనేక అరుదైన, ప్రత్యేక జంతువులకు కేంద్రం లండన్‌ జూపార్కు. ఈ ప్రత్యేక జంతువుల ఆరోగ్య పరిరక్షణకు కాసింత ప్రత్యేక పద్ధతులనే అనుసరిస్తోంది ఈ జూపార్కు నిర్వహణా విభాగం. వాటి బరువు, ఎత్తును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి ఆరోగ్యంలో తేడా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది.

జంతువుల బరువు, ఎత్తు కొలవడం కాస్త కష్టమే. మనుషులు చెప్పినట్టు అవి వినవు కదా మరి. అందుకే లండన్‌ జూలో సాధు జంతువులకైతే లాలించే పద్ధతిలో, సింహం లాంటి క్రూర జంతువులకైతే ఆహారాన్ని ఎరగా వేయడం ద్వారా.. వాటి బరువు, ఎత్తును లెక్కిస్తున్నారు.

కప్ప బరువు కొలుస్తూ

ఓ కర్రకు స్కేలును అమర్చి, పై భాగంలో ఆహారం ఉంచడం ద్వారా సింహాన్ని దాని పై భాగంలోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా సింహం ఎత్తును కొలిచారు.

సింహం పొడవు కొలుస్తూ

పెంగ్విన్లు, కోతులకు ఆహారాన్ని అందించి మచ్చిక చేసుకోవడం ద్వారా వాటి బరువును కొలిచారు.

పెంగ్విన్ బరువు చూస్తున్న సిబ్బంది
కోతుల బరువు కొలుస్తూ

గుడ్ల గూబల శరీర ఉష్ణోగ్రతను ప్రత్యేక యంత్రాలతో లెక్కించారు.

గుడ్లగూబ బరువు కొలుస్తూ

తాబేళ్లు, ఒంటెల బరువు, ఎత్తును కూడా ఆహారాన్ని అందిస్తూ కొలిచారు.

తాబేలు పొడవు చూస్తూ
ఒంటె కొలతలు చూస్తున్న సిబ్బంది

ఇదీ చూడండి:చింపాంజితో మహిళ అఫైర్​​.. 'జూ' అధికారులు ఏం చేశారంటే?

ABOUT THE AUTHOR

...view details