కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌లో రైతులు చేస్తున్న నిరసనలకు విదేశాల్లో భారీగా మద్దతు లభిస్తోంది. బ్రిటన్ రాజధాని లండన్‌లో కర్షకులకు మద్దతిస్తూ ఆందోళన చేపట్టారు అక్కడి ప్రజలు. ఈ నేపథ్యంలో అక్కడి భారత్ హై కమిషన్ ఎదుట భద్రతను కట్టుదిట్టం చేశారు లండన్ పోలీసులు. భారత రాయబార కార్యాలయం ఎదుట భారత వ్యతిరేక, రైతు అనుకూల నినాదాలు చేశారు. భారతీయ వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. ఖలిస్థానీలు జెండాలు చేతబూని నిరసనల్లో పాల్గొన్నారు.
రైతులకు మద్దతుగా బ్రిటన్‌లో వెల్లువెత్తిన నిరసనలు - London police
దేశంలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేస్తున్న నిరసనకు మద్దతుగా బ్రిటన్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సమీపంలో భద్రతా చర్యలు మరింత పటిష్ఠం చేశారు లండన్ పోలీసులు.

భారత రైతులకు మద్దతుగా బ్రిటన్‌లో వెల్లువెత్తిన నిరసనలు
భారత రైతులకు మద్దతుగా బ్రిటన్‌లో వెల్లువెత్తిన నిరసనలు
వివిధ పార్టీలకు చెందిన 36మంది బ్రిటన్ ఎంపీలు భారత రైతుల అంశమై అక్కడి.. విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌కు ఇప్పటికే లేఖ రాశారు. లేబర్ పార్టీకి చెందిన తన్మంజిత్ సింగ్ థేసీ నేతృత్వంలో కూటమిగా ఏర్పడ్డారు.
ఇదీ చదవండి:వెనక్కితగ్గని అన్నదాత- పెరుగుతున్న మద్దతు