తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎయిడ్స్​ నుంచి పూర్తిగా కోలుకున్న రెండో వ్యక్తి ఇతనే! - Ravindra Gupta

మూలకణ మార్పిడి చికిత్స ద్వారా ఓ వ్యక్తి పూర్తిగా హెచ్​ఐవీ నుంచి కోలుకున్న ఘటన లండన్​లో జరిగింది. ఇలా ఓ రోగి హెచ్​ఐవీ/ఎయిడ్స్ నుంచి పూర్తిగా కోలుకోవడం ఇది రెండోసారి. అయితే ఈ చికిత్స రోగులందరికీ పనిచేస్తుందని చెప్పలేమని కేంబ్రిడ్జ్ వైద్యులు చెబుతున్నారు.

London man second patient to be cured of HIV
ఎయిడ్స్​ నుంచి పూర్తిగా కోలుకున్న రెండో వ్యక్తి ఇతనే

By

Published : Mar 11, 2020, 6:22 AM IST

లండన్​కు చెందిన ఓ హెచ్ఐవీ రోగి 'మూల కణ మార్పిడి' ( స్టెమ్ సెల్ ట్రాన్స్​ప్లాంటేషన్​) చికిత్స తరువాత పూర్తిగా కోలుకున్నట్లు కేంబ్రిడ్జ్​ వైద్యులు తెలిపారు. ఇలా హెచ్​ఐవీ నుంచి ఓ వ్యక్తి పూర్తిగా కోలుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకు ముందు 2011లో అమెరికన్​ తిమోతీ బ్రౌన్​ అనే వ్యక్తి మొదటిసారిగా ఈ వైరస్​ నుంచి బయటపడ్డాడు. అతడ్నే 'బెర్లిన్ రోగి' అని కూడా అనేవారు.

క్యాన్సర్​కి చికిత్స చేస్తే...

లండన్​ రోగిగా గుర్తింపు పొందిన 40 ఏళ్ల ఆడమ్ కాస్టిల్లెజో​ నిజానికి వెనుజువెలాకు చెందిన వాడు. 2003లో అతనికి హెచ్​ఐవీ సోకినట్లు కేంబ్రిడ్జ్ పరిశోధకులు గుర్తించారు. తరువాత 2012 వరకు అతనికి మందులు అందిస్తూ ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. ఆ మరుసటి ఏడాదే ఆడమ్​కు ప్రాణాంతకమైన 'హాడ్కిన్స్ లింఫోమా' అనే 'రక్త క్యాన్సర్' వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.

2016లో క్యాన్సర్​ను నయం చేయడానికి ఆడమ్​కు మూలకణ మార్పిడి (ఎముక మజ్జ మార్పిడి) చికిత్స చేశారు వైద్యులు. ఫలితంగా అతనిలో జన్యు పరివర్తన జరిగి, క్యాన్సర్​తో సహా హెచ్​ఐవీ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. 30 నెలల తరువాత చేసిన పరీక్షల్లో.. అతనిలో హెచ్​ఐవీ వైరస్ జాడ పూర్తిగా లేకపోవడాన్ని వైద్యులు గుర్తించారు.

అధ్యయనం ప్రకారం..

రవీంద్ర గుప్తా 'ది లాన్సెట్​ హెచ్​ఐవీ'లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. మూలకణ మార్పిడి చికిత్సతో రోగి పూర్తిగా హెచ్​ఐవీ నుంచి కోలుకున్నాడని ఆయన స్పష్టం చేశాడు. తాము హెచ్ఐవీ వైరస్​ దాక్కొవడానికి వీలు కల్పించే కణాలన్నింటినీ పరిశీలించామన్నారు. అయితే అవి హెచ్​ఐవీకి ప్రతికూలంగా పనిచేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు.

"పరీక్షల్లో హెచ్​ఐవీ 'శిలాజాలు' (ఫాసిల్స్​) కనుగొన్నాం. అయితే ఇవి పునరుత్పత్తి చేయలేకపోతున్నాయి. అదే మేము కూడా ఆశించాం. శరీరంలోని అన్ని కణాలకు వ్యాపించే ఈ వైరస్​.. పూర్తిగా నాశనం కావడం ఊహకు కూడా అందని విషయం."- రవీంద్ర గుప్తా, అధ్యయన కర్త

అందరికీ వర్తించదు..

ఆడమ్ కాస్టిల్లెజోకు మూలకణ మార్పిడి చికిత్స ద్వారా హెచ్​ఐవీ నయం అయినంత మాత్రాన ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని చెప్పలేమని కేంబ్రిడ్జ్ పరిశోధకులు స్పష్టం చేశారు. అనేక మంది ఇతర రోగులకు ఇదే చికిత్స అందించినా వారు అంతగా కోలుకోలేదని తెలిపారు. అయితే హెచ్​ఐవీ/ఎయిడ్స్ నివారణకు ఈ మూలకణ మార్పిడి చికిత్స అందించవచ్చా? లేదా? అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నట్లు వారు తెలిపారు.

ప్రస్తుతం ఏటా దాదాపు 10 లక్షల మంది ఎయిడ్స్​తో మరణిస్తున్నారు.

ఇదీ చూడండి:మధ్యప్రదేశ్​లో రిసార్ట్​ రాజకీయం- అజ్ఞాతంలో ఎమ్మెల్యేలు

For All Latest Updates

TAGGED:

HIVAIDS

ABOUT THE AUTHOR

...view details