లండన్లో విధించిన లాక్డౌన్ సుదీర్ఘకాలం కొనసాగవచ్చని బ్రిటన్ వైద్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ అభిప్రాయపడ్డారు.
కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకుని లండన్ సహా బ్రిటన్లోని పలు ప్రాంతాల్లో దశల వారీగా ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తోంది. కొత్తరకం కరోనా వ్యాప్తి కూడా ఆంక్షలను పటిష్ఠం చేసేందుకు కారణమైంది. హాన్కాక్ ఆదివారం నాడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
"వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కానీ వైరస్ను అదుపు చేయలేం. ఈ కొత్త రకం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న విషయం మన అందరికీ తెలుసు. దీనిని అదుపు చేసేందుకు పాతరకంపై తీసుకున్న వాటి కంటే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి."
-మాట్ హాన్కాక్, వైద్య శాఖ మంత్రి