కరోనాపై ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బందికి అన్ని దేశాల ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. బ్రిటన్ జాతీయ ఆరోగ్య సంస్థ ఉద్యోగులు, అత్యవసర సిబ్బంది సేవలకు గుర్తుగా గురువారం సాయంత్రం లండన్ వీధులు నీలిరంగు కాంతులతో దర్శనమిచ్చాయి. 'లండన్ ఐ ఫెర్రిస్ వీల్', 'ది షార్డ్ స్కైస్క్రాపర్' భవనాలు విద్యుత్ దీపాలంకరణతో కనిపించాయి.
కరోనా లక్షణాలతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చికిత్స పొందుతున్న సెయింట్ థామస్ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది కూడా ఆ సమయంలో బయటకు వచ్చి మద్దతు పలికారు. వైద్యుల సేవలకు కృతజ్ఞతగా లండన్ వాసులంతా తమ ఇళ్లలోనే ఉండి చప్పట్లు కొట్టారు.