తెలంగాణ

telangana

ETV Bharat / international

'బ్రిటన్​ పౌరులారా.. ఇరాన్​, ఇరాక్​ వెళ్లకండి' - ఇరాన్​,ఇరాక్​ ప్రయాణాలు మానుకుంటే మీకే మంచిది-బ్రిటన్​

ఇరాన్​ టాప్​ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో బ్రిటన్​​ పౌరులను ఇరాక్, ఇరాన్​​ దేశాలకు వెళ్లొదని సూచించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ మేరకు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది ఆ దేశ ప్రభుత్వం.

travel advisory
పౌరులారా ఇరాన్​, ఇరాక్​ ప్రయాణాలు మానుకోండి-బ్రిటన్​

By

Published : Jan 4, 2020, 6:35 PM IST

ఇరాన్​లో రెండో శక్తిమంతమైన నేత ఖాసిం సులేమానీని అమెరికా సేనలు మట్టుబెట్టడం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాక్​, ఇరాన్​కు​ సంబంధించిన ప్రయాణాలను రద్దు చేసుకోవాలని బ్రిటన్​​ పౌరులకు సూచించింది ఆ దేశ ప్రభుత్వం.

ఈ మేరకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది ఆ దేశ విదేశాంగ కార్యాలయం.

"టాప్​ కమాండర్​ సులేమానీ​ మరణానంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనుక బ్రిటన్​​ పౌరులు ఇరాక్​లోని కుర్​దిస్థాన్​ ప్రాంతం మినహా ఇరాన్​, ఇరాక్​లోని ఇతర ప్రాంతాల​ ప్రయాణాలను రద్దు చేసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు మీడియాలో అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్త వహించండి. బ్రిటన్​​ పౌరులను సురక్షితంగా ఉంచడమే మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం."

-బ్రిటన్​ ప్రభుత్వ ప్రకటన

శుక్రవారం బాగ్దాద్​ విమానాశ్రయంలో సులేమానీపై అగ్రరాజ్యం వైమానిక దాడులు చేసి హతమార్చడం వల్ల పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

ఇదీ చూడండి: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ప్రమాదం అంచున ప్రపంచం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details