కరోనా వ్యాప్తి చెందిన తొలి దశలోనే ఐరోపాలోని 11 దేశాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేసి ఉంటే 59 వేల మందిని కాపాడే అవకాశం ఉండేదని బ్రిటన్ నిపుణులు చెబుతున్నారు. కొవిడ్-19 వల్ల నమోదైన మరణాల సంఖ్య ఆధారంగా లండన్ ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు ఓ నివేదికను విడుదల చేశారు.
వైరస్‌ను అరికట్టే క్రమంలో పలు దేశాలు ఆంక్షలు విధించి ప్రజలు ఇంటి వద్దే ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. గతేడాది చివర్లో చైనాలో ఉద్భవించిన వైరస్‌కు ఇప్పటి వరకు 42,000 మందికిపైగా బలయ్యారు. ఇటలీలో ఓ వైపు వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉన్నా... లాక్డౌన్ చర్యలు ఆరోగ్య విపత్తును నివారించగలిగాయని వివరించారు. ఈ నియంత్రణ చర్యలు 38,000 మంది ప్రాణాలను రక్షించాయని అంచనా వేశారు పరిశోధకులు.