Lockdown for unvaccinated people: కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పటికే భారత్‌లోనూ రెండు వేవ్‌లు చూశాం. లాక్డౌన్లు ఎదుర్కొన్నాం. అప్పటి పరిస్థితులు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. కొవిడ్ పాజిటివ్ వస్తే నిర్బంధం.. విదేశాలకు ప్రయాణాలు బంద్.. టెస్టులు తప్పనిసరి వంటివి ఎన్నో చూశాం. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టినట్లే.. సాధారణ జీవితం గడపొచ్చు అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఒమిక్రాన్ రూపంలో ముప్పు ముంచుకొంచింది.
మళ్లీ పలు దేశాలు కఠిన ఆంక్షలవైపు మళ్లుతున్నాయి. ఈసారి సరికొత్త రూపంలో లాక్డౌన్లకు సిద్ధమయ్యాయి. అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా నుంచి రక్షగా భావిస్తున్న టీకా తీసుకోకుంటే ఉపేక్షించేదే లేదని తేల్చిచెబుతున్నాయి.
The Countries Locking Down the Unvaccinated: వ్యాక్సిన్ తీసుకోనివారికి లాక్డౌన్లు విధిస్తున్నాయి. వారిని ప్రజా జీవితానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేసి.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని భావిస్తున్నాయి.
Covid in Europe: ఐరోపా దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అక్కడి చాలా ప్రభుత్వాలు ఈ దిశగా కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. ఏఏ దేశాల్లో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయంటే..
జర్మనీ..
ఒమిక్రాన్ వ్యాప్తిని తీవ్రంగా పరిగణించిన జర్మనీ.. వ్యాక్సిన్ తీసుకోనివారికి లాక్డౌన్ విధించింది.
- వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు.. సూపర్ మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫార్మసీలు, థియేటర్లు, సినిమాహాళ్లు, క్రిస్మస్ మార్కెట్లతో పాటు పలు ముఖ్యమైన చోట్లలోకి ప్రవేశించకుండా నిషేధం ఉంది.
- టీకా తీసుకోనివారు బయట తిరగడం కూడా నిషేధం.
- జర్మనీలో రోజువారీ కేసులు ఇటీవల సగటున 70 వేల చొప్పున నమోదవుతున్నాయి.
టీకా తప్పనిసరి..
దేశంలో వ్యాక్సిన్ తప్పనిసరి చేసేందుకు చట్టసభలో ఓ బిల్లు ప్రవేశపెట్టాలని అక్కడి ప్రభుత్వం చూస్తోంది. ఇది ఆమోదం పొందితే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా అమల్లోకి వచ్చే అవకాశముంది.
ఆస్ట్రియా..
Austria introduces lockdown for unvaccinated
ఐరోపాలో అత్యంత తక్కువ వ్యాక్సినేషన్ జరిగిన దేశం ఆస్ట్రియా. ఇక్కడ అర్హులైన 20 లక్షల మందికిపైగా ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇటీవల కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా వీరికి లాక్డౌన్ విధించింది.
- వ్యాక్సిన్ తీసుకోనివారికి అత్యవసరాలకు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
- కెఫే, రెస్టారెంట్లకు వెళ్లేందుకు వీల్లేదు.
దీంతో చాలా మంది.. వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసినవారికి పెద్ద మొత్తంలో జరిమానాలు(రూ.40వేల నుంచి రూ.లక్షా 30 వేల వరకు) విధిస్తున్నారు. వీరిని గుర్తించేందుకు ఆస్ట్రియా పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు.
ఇటలీ..
- ఇటలీలో ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందే. లేకుంటే ఉద్యోగం ఉండదు.
- డిసెంబర్ 6 నుంచి ఇటాలియన్లకు కొవిడ్ గ్రీన్ పాస్ తప్పనిసరి.
- కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్ వేసుకున్నవారికి మాత్రమే ఇది లభిస్తుంది.
- రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లాలంటే ఇది చూపించాల్సిందే.