కరోనా యాంటీబాడీలు.. ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం కంటే తక్కువ మందిలోనే ఉత్పత్తి అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. వాక్సినేషన్‌తోనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం అన్నారు.
" ప్రపంచ జనాభాలో 10 శాతం కంటే తక్కువ మందికే యాంటీబాడీలు ఉన్నాయి. అధిక జనసాంద్రత ప్రాంతాల్లో వైరస్ బారిన పడ్డ వారిలో 50-60శాతం మందికి యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. "
-- సౌమ్యా స్వామినాథన్, డబ్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆమోదించిన టీకాలు కొవిడ్-19 వైరస్‌పై సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు సౌమ్య. వైరస్ లోడ్ తక్కువగా ఉన్నా, లేక కరోనా వచ్చి లక్షణాలు లేని సందర్భాల్లో వ్యాక్సిన్ల పనితీరుపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 114 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు. 2.5 మిలియన్ల మందికిపైగా వైరస్‌తో మరణించారు.
ఇదీ చదవండి :సింగిల్ డోస్ టీకాకు చైనా అనుమతి- అమెరికాకు పోటీగానే!