ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించే విషయంలో భారత్లోని బ్రిటీష్ హైకమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనీలాండరింగ్ తదితర ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని భారత్కు అప్పగించడమనేది న్యాయపరమైన, కార్యనిర్వహణ ప్రక్రియ అని అన్నారు. పేరును ప్రస్తావించకుండా మాల్యాను, నీరవ్ మోదీని వెనక్కి రప్పించేందుకు రప్పించడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని, పడుతున్న తొందరను గుర్తిస్తున్నానని అన్నారు.
మాల్యాను భారత్కు పంపించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది అని ప్రశ్నించగా ఈ విధంగా జవాబిచ్చారు.
''మాల్యాను భారత్కు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఆయనను అప్పగించడం అనేది చట్టపరమైన విషయం. న్యాయస్థానాలు చూసుకుంటున్న విషయం కూడా. మా న్యాయస్థానాలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయి. దీనికి షార్ట్కట్ లాంటివేమీ ఉండవు.