తెలంగాణ

telangana

By

Published : Dec 29, 2020, 9:37 AM IST

ETV Bharat / international

లక్షణాలు లేకపోయినా బాధితులకు దీర్ఘకాల రక్షణ!

కొవిడ్​ లక్షణాలు ఉన్నా, లేకపోయినా బాధితులకు దీర్ఘకాల రక్షణ ఉంటుందని క్వీని మోరీ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్​ సంయుక్తంగా చేసిన పరిశోధనలో తేలింది. రోగ నిరోధక వ్యవస్థలో టి-కణాల స్పందనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ ఫలితాన్ని వెల్లడించారు.

Lasting immunity against COVID-19 found after mild or asymptomatic infection reports a Study
లక్షణాలు లేకపోయినా... బాధితులకు దీర్ఘకాల రక్షణ!

కొవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నా, అస్సలు లేకపోయినా... బాధితుల్లో నాలుగు నెలల తర్వాత కూడా రోగనిరోధక శక్తి ఉంటోందని తాజా పరిశోధనలో తేలింది. క్వీని మోరీ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్​ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. గత మార్చిలో మహమ్మారికి గురైన 136 మంది ఆరోగ్య సిబ్బంది రోగ నిరోధక వ్యవస్థలో టి-కణాల స్పందనను వారు అధ్యయనం చేశారు.

"ఇన్​ఫెక్షన్​కు గురై, స్వల్ప లక్షణాలు తలెత్తిన 89 శాతం మంది ఆరోగ్య సిబ్బందిలో... 16-18 వారాల తర్వాత కూడా యాంటీబాడీలు ఉంటున్నాయి. 66 శాతం మందిలో ఇవి హెచ్చుస్థాయిలో, అత్యంత చైతన్యవంతంగా ఉండటం విశేషం. కొందరిలో యాంటీబాడీలు లేకపోయినా, టి-కణాలు మాత్రం వైరస్​కు వ్యతిరేకంగా స్పందిస్తున్నాయి. ఇలాంటి వారు మళ్లీ వైరస్​కు గురైనా... యాంటీ బాడీలు, టి-కణాలు ఉత్పత్తయి, ఇన్​ఫెక్షన్​ నుంచి రక్షణ కల్పిస్తాయి. కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక స్పందన సమృద్ధిగా ఉంటున్నందున- వ్యాక్సిన్లు కూడా మహమ్మారి నుంచి దీర్ఘకాల రక్షణ కల్పించే అవకాశముంది" అని పరిశోధనలో పాలుపంచుకున్న జోసెఫ్ గిబన్స్ తెలిపారు.

ఇదీ చదవండి:'90శాతం దేశాల్లో ఆరోగ్య సేవలపై 'కరోనా' ఎఫెక్ట్​'

ABOUT THE AUTHOR

...view details