బ్రిటన్‌లో వార్షిక రిమెంబరెన్స్ డే కార్యక్రమం మొదటి ప్రపంచ యుద్ధం ముగింపునకు గుర్తుగా ప్రతి ఏటా నిర్వహించే 'రిమెంబరెన్స్ డే' కార్యక్రమం బ్రిటన్ లండన్‌లో జరిగింది. యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఈ 'రిమెంబరెన్స్ డే' నిర్వహిస్తారు.
1918 నవంబర్ 11న మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆనాటి స్మృతులకు చిహ్నంగా ప్రతీఏటా ఆ తేదీకి సమీపంలో ఉన్న ఆదివారం రోజున ఈ రిమెంబరెన్స్ డేను జరుపుకుంటారు.
పరేడ్‌తో కిక్కిరిసిన లండన్ వీధులు...
ఈ వార్షిక కార్యక్రమంలో బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ సహా రాజకుటుంబీకుల సభ్యులు, ప్రధాని బోరిస్, విపక్ష నేతలు పాల్గొన్నారు. వేలాది మంది సైనిక సిబ్బంది, ప్రముఖులు, ప్రజలంతా కలిసి యుద్ధంలో మరణించిన వీరులకు నివాళులర్పించారు. కొంతసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సైనకులు లండన్ వీధుల్లో కవాతు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీ-47 యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించిన ఈ విమానాన్ని... రిమెంబరెన్స్ డే కార్యక్రమంలో భాగంగా దక్షిణ ఇంగ్లాండ్‌లోని బ్రిటన్ యుద్ధ స్మారకంపై 7,50,000 పేపర్ పాప్పిస్ (గులాబీ రేకులు)లను వదిలింది.
ఇదీ చదవండి:117 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో ఇదే తొలిసారి