జర్మనీలోని హైస్పీడ్ రైలులో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడడం వల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం 9 గంటలకు (జర్మనీ కాలమానం ప్రకారం) ఘటనకు సంబంధించి తమకు తొలి ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జర్మనీలోని హైస్పీడ్ ఐసీఈ రైళ్లలో ఒకటైన ఈ రైలు రెగన్స్బర్గ్- న్యూరెంబర్గ్ నగరాల మధ్య పరుగులు పెడుతుంది. ఈ ఘటన అనంతరం పోలీసులు స్కూబర్ స్టార్ఫ్ స్టేషన్ రైలును నిలిపివేశారు.
హైస్పీడ్ రైలులో కత్తితో దాడి - జర్మన్ హైస్పీడ్ రైలులో దాడి
ఓ హైస్పీడ్ రైలులో దుండగుడు నానా వీరంగం సృష్టించాడు. కత్తి తీసుకొని రైలులో ఉన్న వారిపై దాడికి దిగాడు. జర్మనీలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
హైస్పీడ్ రైలులో కత్తితో దాడి
దాడికి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన వెనక ఉద్దేశం ఏమిటనేది తెలియాల్సి ఉందని జర్మనీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సీహోఫెర్ తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి స్కూబర్స్టార్ఫ్ స్టేషన్‌ను మూసివేశామని, రెగన్స్బర్గ్- న్యూరెంబర్గ్ నగరాల మధ్య సేవలను నిలిపివేసినట్లు జర్మన్ రైల్వేశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన విమానం.. 'పాప్‌స్టార్' దుర్మరణం