తెలంగాణ

telangana

ETV Bharat / international

21 ఏళ్లకే టిక్​టాక్​లో సంచలనం.. నంబర్-1పై గురి - viral news today

టిక్​టాక్​లో అనతికాలంలోనే కోట్ల మంది ఫాలోవర్లను సంపాందించుకుని సంచలనం సృష్టించాడు ఖాబీ లేమ్​. ఇప్పుడు 84 మిలియన్ల ఫాలోవర్లతో అత్యధిక అభిమానులున్న సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో ఉన్న చార్లీ డి అమెలియోను త్వరలోనే అధిగమిస్తాడని ఖాబీ అభిమానులు ధీమాగా ఉన్నారు. 21 ఏళ్ల అతనికి ఈ స్థాయిలోఆదరణ లభించడానికి కారణమేంటంటే..

Khaby Lame
21 ఏళ్లకే టిక్​టాక్​లో సంచలనం.. నంబర్-1 స్థానంపై గురి

By

Published : Jul 14, 2021, 11:32 AM IST

Updated : Jul 14, 2021, 1:04 PM IST

ఇటలీలో నివాసముండే 21 ఏళ్ల ఖాబానీ లేమ్​ అలియాస్ ఖాబీ లేమ్​.. టిక్​టిక్​లో అతి తక్కువ సమయంలో అత్యధిక ఫాలోవర్లు గల సెలబ్రిటీగా అవతరించి సంచలనం సృష్టించాడు. 81 మిలియన్ల ఫాలోవర్లతో టిక్​టాక్​లో రెండో స్థానంలో ఉన్న ఆడిసన్ రేను వెనక్కి నెట్టాడు. జూన్​లో 65 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఖాబీకి ఇప్పుడు 84 మిలియన్లకుపైగా అభిమానులున్నారు. త్వరలోనే తను 120 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న చార్లీ డి అమెలియోను అధిగమించి నంబర్-1 స్టార్​గా అవతరిస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

ఎందుకింత ఆదరణ..

ఆఫ్రికా దేశం సెనెగలీస్​కు చెందిన ఖాబీ ప్రస్తుతం ఇటలీలో ఉంటున్నాడు. తన ప్రత్యేక హావభావాలు, చేష్టలతో టిక్​టాక్​లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ఖాబీ చేసే చిన్న చిన్న స్కిట్లు, కొన్ని క్లిష్టమైన వీడియోలపై ఆయన వ్యంగ్యంగా స్పందించే విధానం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన కామెడీ చూసినవారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. దీంతో కొద్ది నెలల్లోనే ఆయనను అనసరించే వారి సంఖ్య కోట్లలో పెరిగింది.

ఖాబీ కొద్ది నెలల క్రితం ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. కరోనా లాక్​డౌన్ కారణంగా ఆయన ఉద్యోగం పోయింది. దీంతో టిక్​టాక్​ వీడియోలపైనే ఎక్కువ దృష్టి సారించి.. మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.

21 ఏళ్లకే టిక్​టాక్​లో సంచలనం.. నంబర్-1పై గురి
21 ఏళ్లకే టిక్​టాక్​లో సంచలనం.. నంబర్-1పై గురి

ఇదీ చూడండి: Viral: న్యాయవాదిని కరిచిన శునకాలకు 'మరణ శిక్ష'!

Last Updated : Jul 14, 2021, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details