జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు విషయం బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలల్లో ప్రధాన అంశంగా మారింది. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని బ్రిటన్ లేబర్ పార్టీ ఇదివరకే తీర్మానం రూపొందించింది. దీంతో భారత్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని లేబర్ పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా కొందరు భారత సంతతి వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా పోస్టులు పెడుతున్నారు.
భారతదేశానికి, హిందువులకు.. లేబర్ పార్టీ వ్యతిరేకంగా ఉంటోందని విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ అనుకూలవాదులు లండన్‌లో చేసిన నిరసనలను ఎందుకు ఖండించలేదంటూ లేబర్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఆర్టికల్-370 రద్దుపై పాకిస్థాన్ చేస్తున్న గుడ్డి వాదనను లేబర్ పార్టీ సమర్థించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
కశ్మీర్‌పై.. పక్షపాతంతో కూడిన తీర్మానాన్ని వెన్నక్కి తీసుకోవాలని లేబర్ పార్టీ లీడర్ జెరేమి కార్బన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు భారత సంతతికి ప్రాతినిధ్యం వహిస్తున్న రెస్పెక్ట్ బ్రిటీష్ ఇండియన్స్. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క బ్రిటీష్ రాజకీయ నాయకులు తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు.
తప్పుగా వక్రీకరించారు