తెలంగాణ

telangana

ETV Bharat / international

బుకర్​ ప్రైజ్​-2019 విజేతలుగా మార్గరెట్​, ఎవరిస్టో - బుకర్​ ప్రైజ్​ తెలుగులో

ఆంగ్ల సాహిత్య రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు బుకర్​ ప్రైజ్​ 2019గానూ ఇద్దరు మహిళలు ఎంపికయ్యారు. కెనడియన్​ రచయిత మార్గరెట్​ ఎట్​వుడ్​, ఆంగ్లో-నైజీరియన్​ రచయిత బెర్నర్​డైన్​ ఎవరిస్టోలకు సంయుక్తంగా ఈ బహుమతిని ప్రకటించారు.

బుకర్​ ప్రైజ్​-2019 విజేతలుగా మార్గరెట్​, ఎవరిస్టో..

By

Published : Oct 15, 2019, 6:09 AM IST

Updated : Oct 15, 2019, 7:43 AM IST

కెనడా రచయిత్రి మార్గరెట్ ఎట్​వుడ్​, బ్రిటీష్‌ రచయిత్రి బెర్నార్​డైన్​ ఎవరిస్టో సంయుక్తంగా 2019 బుకర్ బహుమతిని గెలుచుకున్నారు.

లండన్‌లోని గిల్డ్‌హాల్‌ వేదికగా పీటర్ ఫ్లోరెన్స్‌ ఆధ్వర్యంలోని న్యాయనిర్ణేతల బృందం ఈ మేరకు విజేతల పేర్లను ప్రకటించింది. 'ది టెస్టామెంట్​' రచనకు ఎట్​వుడ్​, 'గర్ల్​, ఉమన్​, అదర్​' రచనకు గానూ ఎవరిస్టోలకు ఈ అవార్డు లభించింది.

సంయుక్తంగా బుకర్​ప్రైజ్​ అందుకున్న మార్గరెట్​, ఎవరిస్టో

ఈ అవార్డు కింద 50 వేల పౌండ్ల నగదును ఇద్దరు రచయితలు సమంగా పంచుకోనున్నారు. లండన్‌ వేదికగా 1969 నుంచి ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. బుకర్‌ ప్రైజ్‌ నియమాలకు విరుద్ధంగా మరోసారి న్యాయనిర్ణేతలు ఇద్దరికి సంయుక్తంగా అవార్డును ప్రకటించారు. బుకర్‌ ప్రైజ్ అవార్డును ఇద్దరికి కలిపి ఇవ్వకూడదని 1992 సంవత్సరంలో నిర్ణయించారు. అయినప్పటికీ ఈ ఏడాది ఇద్దరి రచనలు పోటాపోటీగా నిలవడం వల్ల న్యాయనిర్ణేతలు ఇద్దరికీ సంయుక్తంగా అవార్డును ప్రకటించారు.

79 ఏళ్ల వయసులో ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా ఎట్‌వుడ్‌, మొదటి నల్లజాతి మహిళగా బెర్నర్‌డైన్‌ రికార్డులకెక్కారు. ఎట్‌వుడ్‌ రెండోసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

Last Updated : Oct 15, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details