తెలంగాణ

telangana

ETV Bharat / international

'భానుడి ప్రతాపం': జులైలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత - కాలుష్యం

ఆఫ్రికా, ఐరోపాల్లో ఎండలు మండిపోతున్నాయి. 2019 జులైలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తాజాగా ఓ సంస్థ నివేదికలో తెలిపింది. వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణంగా పేర్కొంది.

'భానుడి ప్రతాపం': జులైలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత

By

Published : Aug 6, 2019, 7:51 AM IST

ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏటా పెరిగిపోతున్నాయి. ఐరోపా సమాఖ్య ఉపగ్రహ ఆధారిత నెట్​వర్క్​ తాజాగా ఓ నివేదికను వెల్లడించింది. 2019 జులై మాసంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాదిలో నమోదైన ఉష్ణోగ్రతల్లో అత్యధికం జులై నెలలోనే కాగా, ప్రపంచ వ్యాప్తంగానూ ఇదే రికార్డు అని కోపర్నికస్​ క్లైమేట్​ ఛేంజ్​ సర్వీస్​ ప్రతినిధి జీన్​ నోయల్​ థెపాట్​ ఓ ప్రకటనలో తెలిపారు.

వాతావరణ మార్పులే కారణం

వాయు ఉద్గారాల ప్రభావంతోనే వాతావరణంలో మార్పులొస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు ప్రతిఏటా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఇంకా తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉంది.

అలస్కా, గ్రీన్​లాండ్​, సైబీరియా, మధ్య ఆసియా, ఇరాన్​, అట్లాంటిక్​ ప్రాంతాల్లో 1981 నుంచి 2010 వరకు నమోదైన ఉష్ణోగ్రతలను పోలిస్తే అత్యధికంగా పెరిగాయి. ప్రధానంగా సైబీరియా, అలస్కా లాంటి ప్రాంతాల్లో కార్చిచ్చు వల్ల అడవిలో మంటలు చెలరేగి 100 మిలియన్​ టన్నుల కార్బన్​ డై ఆక్సైడ్​ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రత

2019 జులైలో గత రికార్డు (2016 జులై) కంటే 0.04 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. 2015 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ 5 సంవత్సరాలు అత్యంత ఉష్ణోగ్రతలు కలిగిన కాలంగా చెప్పవచ్చు. 21వ శతాబ్దంలో ఏటా ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతూనే ఉంది.

ఇదీ చూడండి:సామాన్య శాస్త్రం : ఇది సామాన్యుల ఫొటో గ్యాలరీ

ABOUT THE AUTHOR

...view details