బెయిల్ నిబంధనల ఉల్లంఘన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు భాగస్వామి స్టెల్లా మోరిస్‌ను (Stella Morris Julian Assange) వివాహం చేసుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే వివాహం (Stella Morris Julian Assange) జరిగే తేదీపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.
వివాహానికి అధికారులు అనుమతివ్వడంపై అసాంజే భాగస్వామి స్టెల్లా మోరిస్ (Stella Morris Julian Assange) స్పందించారు. 'ఇక మీదట మా పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రావని ఆశిస్తున్నాను' అని స్టెల్లా పేర్కొన్నారు.
ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో..
లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో తన న్యాయవాదులలో ఒకరైన స్టెల్లా మోరిస్‌తో ప్రేమలో పడ్డారు అసాంజే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఏప్రిల్‌లో అసాంజే-మోరిస్ జంట తమ బంధాన్ని బయటపెట్టింది. ఈ ఏడాది జనవరిలో.. జైలులో వివాహం చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే వికీలీక్స్‌లో అమెరికా రహస్య సమాచారాన్ని బయటపెట్టారు. ఆ దేశం నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందారు. ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అసాంజేను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి :Raja Chari: రోదసిలోకి మన రాజాచారి!