లండన్ హైకోర్టులో బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్కు ఊరట లభించింది. పార్లమెంటు రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది న్యాయస్థానం. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టుకు అప్పీలు చేసే అవకాశం కల్పించింది.
ఈ పిటిషన్ను గినా మిల్లర్ అనే వ్యక్తి దాఖలు చేశారు. గతంలో బ్రెగ్జిట్ ఒప్పందానికి పార్లమెంటు తప్పనిసరి చేయాలని సుప్రీంలో బిడ్ వేసి గెలిచారు. తాజా తీర్పు అనంతరం తమ న్యాయ సలహా బృందంతో పోరాడుతూనే ఉంటామని మిల్లర్ స్పష్టం చేశారు.