తెలంగాణ

telangana

By

Published : Oct 3, 2019, 10:03 AM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​పై బ్రసెల్స్​కు బోరిస్​ జాన్సన్​ 'రాజీ' ఆఫర్​!

ఐరోపా సమాఖ్య​ నుంచి బ్రిటన్​ వైదొలిగే అంశంపై బ్రస్సెల్స్​తో రాజీకొచ్చారు ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​. రాజీ ప్రణాళికలను ఆ దేశానికి సమర్పించనున్నట్లు కన్జర్వేటివ్​ పార్టీ వార్షిక సదస్సులో తెలిపారు. ఈయూ నాయకులు ఈ ప్రతిపాదనలను అర్థం చేసుకోకుంటే అక్టోబర్​ 31నే ఎలాంటి ఒప్పందం లేకుండానే వైదొలుగుతామని హెచ్చరించారు.  ఈ నెల 8 నుంచి 14 వరకు పార్లమెంట్​ను రద్దు చేయాలని కోరనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

బ్రెగ్జిట్​పై బ్రసెల్స్​కు బోరిస్​ జాన్సన్​ 'రాజీ' ఆఫర్​!

బ్రెగ్జిట్​పై బ్రసెల్స్​కు బోరిస్​ జాన్సన్​ 'రాజీ' ఆఫర్​!

బ్రెగ్జిట్​ ఒప్పందం కోసం రాజీ ప్రణాళికలను బ్రస్సెల్స్​కు సమర్పించనున్నట్లు ప్రకటించారు బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్న భయాలు ఉన్నప్పటికీ ఈ ప్రతిపాదనలు ఆమోదించాలన్నారు. లేదంటే ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి ఈ నెల చివరికల్లా ఎలాంటి ఒప్పందం లేకుండా వైదొలిగేందుకు బ్రిటన్​ సిద్ధమవుతుందని హెచ్చరించారు.

మాంచెస్టర్​లో జరిగిన కన్జర్వేటివ్​ పార్టీ వార్షిక సదస్సు ముగింపు సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు బోరిస్. ఐర్లాండ్​తో బ్రిటన్​ సరిహద్దును తెరిచి ఉంచాలనే వివాదాస్పద సమస్యను ఈ ప్రణాళికలు పరిష్కరిస్తాయని చెప్పారు. ఈ ప్రతిపాదనలను ఈయూ నాయకులు అర్థం చేసుకుంటారని ఆకాంక్షించారు.

ఈ రాజీ ఆఫర్​పై చర్చించేందుకు యురోపియన్​ కమిషన్​ అధ్యక్షుడు జీన్​ క్లాడ్​ జుంకర్తోతో మాట్లాడనున్నారు జాన్సన్​.

బ్రెగ్జిట్​పై మాజీ ప్రధాని థెరిసా మే మాదిరిగానే పార్లమెంట్​లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జాన్సన్​. అక్టోబర్​ 17న ఈయూ శిఖరాగ్ర సదస్సులో ఒప్పందం కుదుర్చుకోకపోతే బ్రెగ్జిట్​ను ఆలస్యం చేయాలని కోరుతూ గత నెలలో ఎంపీలు ఒక చట్టాన్ని ఆమోదించారు. ఎంపీల నిర్ణయంతో ఒప్పందం లేకుండా నిష్క్రమిస్తామని ఆయన ఇచ్చిన వాగ్దానం దెబ్బతింది.

బ్రిటన్​ పార్లమెంటు మూడు సార్లు తిరస్కరించిన.. బ్రస్సెల్స్​తో మే అంగీకరించిన నిష్క్రమణ నిబంధనలపై జాన్సన్​ తిరిగి చర్చలు జరుపుతున్నారు. మే ప్రతిపాదించిన వివాదాస్పద ప్రణాళికలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంపై ఆయన దృష్టి సారించారు. ఇవి బ్రెగ్జిట్​ అనంతరం బ్రిటీష్​ ఉత్తర ఐర్లాండ్​, ఈయూ సభ్య దేశం ఐర్లాండ్​తో సరిహద్దు తెరిచి ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

8 నుంచి పార్లమెంట్​ రద్దు..

బ్రిటన్​ పార్లమెంట్​ను అక్టోబర్​ 8 నుంచి 14 వరకు సస్పెండ్​ చేయాలని జాన్సన్​ కోరినట్లు ​ప్రధాని కార్యాలయం తెలిపింది. గత పార్లమెంట్​ రద్దు ప్రయత్నం చట్టవిరుద్ధమని ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన కొన్ని వారాల తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: అమెరికా తయారీ రంగంపై మాంద్యం మబ్బులు

ABOUT THE AUTHOR

...view details