తెలంగాణ

telangana

ETV Bharat / international

జిల్​ జిల్​ 'బ్రెజిల్​'

రియో డీ జెనీరోలో బ్రెజిల్​ కార్నివాల్​ అంగరంగ వైభవంగా జరుగుతోంది. వివిధ రకాల వేషధారణల్లో స్థానికులు పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తున్నారు.

బ్రెజిల్​ కార్నివాల్​

By

Published : Mar 2, 2019, 4:08 PM IST

బ్రెజిల్​ కార్నివాల్​

బ్రెజిల్​ కార్నివాల్​ కోసం రియోడీజెనీరో నగరం సరికొత్తగా ముస్తాబయింది. వేడుకలకు వేలాదిగా ప్రజలు హాజరవుతున్నారు. కొన్నేళ్ల నుంచి సంప్రదాయంగా బ్రెజిలియన్లు జరుపుకునే ఈ కార్నివాల్ మార్చి 1న అట్టహాసంగా ప్రారంభమయింది. మార్చి9 వరకు దాదాపు 10రోజుల పాటు ఈ సంబరాలు జరగనున్నాయి.

రాజధాని నగరమంతా విద్యుద్దీపాలంకరణతో దర్శనమిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యటకులతో కలిసి స్థానికులు వీధుల్లో పార్టీలు చేసుకుంటున్నారు. వేలాదిమంది ఉల్లాసంగా నృత్యం చేస్తూ నిర్వహించే కవాతు కార్నివాల్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంగీత కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తూ... కార్నివాల్​లో పాల్గొన్న వారిని మరింత ఉత్తేజపరుస్తున్నారు.

ఫ్యాషన్​ డిజైనర్ల సాయంతో స్థానిక యువతీయువకులు వివిధ రకాల వేషధారణలతో సరికొత్తగా దర్శనమిస్తున్నారు. ఒక్కసారి ఈ వేడుకలో పాల్గొంటే జీవితాంతం గుర్తుండేలా అనుభూతి పొందుతారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

విదేశీ పర్యటకులు ఈ అద్భుత దృశ్యాలను చూడాలంటే 50 నుంచి 120 అమెరికన్​ డాలర్లు ఖర్చు చేయాల్సిందే.

" రియో డీ జెనీరోలో జరుగుతున్న ఈ కార్నివాల్​ అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ స్త్రీలకు కావాల్సిన అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉంటాయి. పార్టీలు చేసుకునేందుకు కూడా ఇది అనువైన ప్రదేశం. మోడళ్లను ఆకర్షించే విధంగా సారోంగ్​ బాల్​, కోపాకబానా బాల్​, వోగ్​ బాల్​ వంటి నూతన వస్త్రాలను ఇప్పుడు అమ్ముతున్నాం."
-అమందా టమరోజి, మోడల్​

ABOUT THE AUTHOR

...view details