తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ టీకా​ తీసుకున్నా.. ఈయూ దేశాలకు అనుమతి!

కొవిషీల్డ్​ టీకా తీసుకున్న విదేశీ ప్రయాణికులపై ఎలాంటి నిషేధం లేదని ఐరోపా సమాఖ్య(ఈయూ) రాయబారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఈయూ గ్రీన్‌ పాస్‌ జాబితాను విడుదల చేశారు.

European union
ఐరోపా సమాఖ్య

By

Published : Jun 30, 2021, 5:12 AM IST

విదేశీ ప్రయాణికుల విషయంలో కొవిషీల్డ్‌ టీకాపై ఎలాంటి నిషేధం లేదని ఐరోపా సమాఖ్య(ఈయూ) రాయబారి స్పష్టం చేశారు. తమ దేశానికి విదేశాల నుంచి వచ్చే వాళ్లు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే అనుమతిస్తారో వివరిస్తూ.. ఈయూ గ్రీన్‌ పాస్‌ జాబితాను విడుదల చేశారు.

అందులో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ లేదని ప్రచారం జరిగింది. దీంతో కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తులు.. గ్రీన్ పాస్ పథకం కింద ఈయూ సభ్య దేశాలకు వెళ్లేందుకు అర్హత లేదని భారత్‌లో భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఈయూ రాయబారి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అనుమతిచ్చిన కరోనా వ్యాక్సిన్‌లకు గ్రీన్ పాస్ పొందేందుకు అంగీకరించే అవకాశముందని తెలిపారు.

ఐరోపా సభ్య దేశాలకు ప్రయాణించేందుకు ఇది ముందస్తు షరతు కాదని స్పష్టం చేశారు. మహమ్మారి కారణంగా భారత్‌తో సహా దేశాల్లో ఈయూ ప్రయాణ ఆంక్షలు అమలు చేస్తోందని.. పరిస్థితులు కుదుట పడితే ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:ఆ దేశ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details