కరోనాపై పోరాడేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఐక్యంగా ముందుకు సాగితేనే వైరస్‌ను జయించవచ్చన్నారు. ఇవాళ వర్చువల్ గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, మనమంతా జీవితకాల అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వైరస్‌కు, మానవత్వానికి మధ్య జరగుతున్న యుద్దంలో ఐకమత్యంతో ముందుకుసాగి పైచేయి సాధించాలని తెలిపారు.
వైరస్‌కు, మానవత్వానికి మధ్య పోరు: బోరిస్ - latest international news in telugu
ప్రపంచదేశాలన్నీ ఐక్యంగా పోరాడి కరోనా మహమ్మారిని ఓడించాలని పిలుపునిచ్చారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. జీవితకాల అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అన్ని దేశాలు సహకరించుకోవాలని స్పష్టం చేశారు.
బోరిస్ నిర్వహించి ఈ సమావేశంలో కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, నార్వే, సౌదీ అరేబియా పాల్గొన్నాయి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి బ్రిటన్ ప్రభుత్వం 388 మిలియన్ పౌండ్లను సమకూరుస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రకటించిన 744 మిలియన్ పౌండ్ల నిధుల్లో ఇవి భాగమన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలవడమేగాక కరోనా మహమ్మారిని అంతమొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్దికి సంయుక్తంగా ఏర్పాటైన కూటమికి 250 మిలియన్లను కేటాయించి అత్యధిక నిధులు అందించిన దేశంగా బ్రిటన్ నిలిచింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ది చేస్తున్న కరోనా వ్యాక్సిన్ పురోగతిపై ఈ సమామేశంలో తెలిపారు జాన్సన్. వ్యాక్సిన్ భారీ సంఖ్యలో తయారు చేసి పంపిణీ చేసేందుకు భాగస్వాములు కావాలని యూనివర్సిటీ ప్రకటించింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌పై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.