కరోనా వైరస్‌తో ఇటలీలో తాజాగా 636మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 16వేల 523కు చేరింది. అయితే ఆదివారం(525)తో పోల్చితే మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటలీలో కరోనా పాజిటివ్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 3వేల 599మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం 1,32,547 కేసులు నమోదయ్యాయి.
బ్రిటన్‌లో...
బ్రిటన్‌లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. స్థానిక కాలామానం ప్రకారం.. ఏప్రిల్ 5, సాయంత్రం 5 గంటల వరకు మృతుల సంఖ్య 5వేలు దాటింది. 439 తాజా మరణాలతో ఇప్పటి వరకు మొత్తం 5వేల 373మంది ప్రాణాలు కోల్పోయారు.