ఇటలీ దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10 వేలు దాటింది.
ఇటలీలో 10వేలు దాటిన కరోనా మరణాలు - ఇటలీలో10వేలు దాటిన కరోనా మరణాలు
ఇటలీలో కరోనా మహమ్మారి ధాటికి గడిచిన 24 గంటల్లో 889 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 10వేలు దాటింది.
ఇటలీలో10వేలు దాటిన కరోనా మరణాలు
గడిచిన 24 గంటల్లో 889 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 10,023కు చేరింది. దేశవ్యాప్తంగా కొత్తగా 5,974 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 92,472కు చేరింది.
ఐరోపా దేశాల్లో మరణాలు, కేసుల సంఖ్యలో ఇటలీ మొదటి స్థానంలో ఉండగా.. స్పెయిన్ తర్వాతి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 29వేలకుపైగా మరణాలు సంభవించగా ఐరోపాలోనే 20వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.