ఇటలీలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తూనే ఉంది. రోజుకు వందల సంఖ్యలో మరణాలు నమోదవడం.. ఆ దేశాన్ని తీవ్ర భయాందోళలకు గురిచేస్తోంది. ఆ దేశంలో శనివారం 793 మంది కరోనాకు బలవ్వగా.. మరో 6,557 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు.
ఇటలీలో ఆగని కరోనా మరణాలు- ఒక్కరోజులో 793 మంది - Italy today news
ఇటలీపై కరోనా పంజా: 24గంటల వ్యవధిలోనే 793 మంది బలి
23:36 March 21
ఇటలీలో 4,825కు చేరిన మృతులు
రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్న కొవిడ్-19 మరణాల సంఖ్య.. ఇటలీలో ఇప్పటివరకు 4,825కు చేరింది. ఈ సంఖ్య ప్రపంచస్థాయి మృతులలో 38.5 శాతం కావడం గమనార్హం. వేగంగా విస్తరిస్తున్న వైరస్ కారణంగా.. ఇప్పటివరకు ఆ దేశంలో బాధితుల సంఖ్య 53,578కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 12 వేలు దాటింది.
ఇదీ చదవండి:నగరానికి తాళం వేసి కరోనాపై కసితీరా గెలిచి
Last Updated : Mar 22, 2020, 1:24 AM IST