ఇటలీలో కరోనా మారణహోమం కొనసాగుతూనే ఉంది. వైరస్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య రోజురోజూకూ పెరుగుతోంది. దేశంలో కరోనా కారణంగా మరో 651 మంది బలైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,476కి చేరింది.
ఇటలీలో శాంతించని కరోనా-మరో 651మంది మృతి - కరోనాలో మరో 651 మంది బలి
ఇటలీలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. కొవిడ్ కారణంగా మరో 651 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 5,476కు చేరగా... కేసుల సంఖ్య 59 వేలు దాటింది.
ఇటలీలో శాంతించని కరోనా-మరో 651మంది మృతి
నిన్నటితో పోలిస్తే మరణాల సంఖ్య(793) తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒక్క రోజులో నమోదైన రెండో అత్యధిక మరణాలు ఇదే కావడం గమనార్హం.
మరోవైపు దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 10.4 శాతం పెరిగింది. మొత్తం కేసులు 59,138గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.