ప్రాణాంతక కొవిడ్-19 మహమ్మారి ఇటలీని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 475 మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. గతేడాది చైనాలో వైరస్ పుట్టుకొచ్చినప్పటి నుంచి ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి.
మొత్తం మృతుల సంఖ్య 2, 978కి చేరింది. 35 వేల 713 మందికి వైరస్ సోకింది. అంతకుముందూ ఒక్కరోజులో 368 మంది ఇటలీలోనే చనిపోవడం గమనార్హం.
యూకేలో...
బ్రిటన్లోనూ కరోనా మరణాలు ఎక్కువయ్యాయి. అక్కడ 104 మంది కొవిడ్-19కు బలైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.