బ్రిటన్లో నమోదైన కరోనా మరణాల లెక్కలతో పోల్చితే ఇటలీలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. యూకేలో 64,267 మంది చనిపోగా... ఇటలీలో 64,520 మంది మరణించినట్లు హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. వైరస్ వ్యాప్తి మొదటి దశలో ఉన్నప్పుడు మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేసింది.
ఈ లెక్కలు ప్రభుత్వాన్ని కలవర పెడుతున్నాయి. ఈ క్రమంలో రానున్నది పండుగ సీజన్ కావడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి డిసెంబర్ 21 నుంచి జనవరి 6 వరకు ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అత్యవసర అవసరాలకు మినహా ప్రయాణాలు చేయకూడదని తెలిపింది. ఈ ప్రయాణ నియమాలలో కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది అక్కడి ప్రభుత్వం.