తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ నుంచి ఇటలీకి పాకిన 'కొత్త రకం' కరోనా

బ్రిటన్​లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా ఇటలీకి కూడా పాకింది. తమ దేశంలో ఈ తరహా కేసు ఒకటి గుర్తించినట్లు ఇటలీ వైద్య శాఖ తెలిపింది. రోగి బ్రిటన్ నుంచే వచ్చారని పేర్కొంది. మరోవైపు, కొత్త రకం కరోనా వైరస్ కారణంగా బ్రిటన్ విమానాలపై నిషేధం విధించిన జాబితాలో కెనడా చేరింది.

coronavirus mutation
ఇటలీకి సోకిన 'కొత్త' కరోనా- రోగి బ్రిటన్ నుంచే

By

Published : Dec 21, 2020, 8:56 AM IST

బ్రిటన్​లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్​ ఆనవాళ్లను ఇటలీలో కూడా బయటపడ్డాయి. తాజాగా ఈ కొత్త వైరస్​కు సంబంధించి ఓ కేసును గుర్తించినట్లు అక్కడి వైద్యశాఖ తెలిపింది. రోగి, తన జీవిత భాగస్వామితో కలిసి బ్రిటన్ నుంచి ఇటీవలే వచ్చినట్టు పేర్కొంది. వారిని ఐసోలేషన్​లో ఉంచినట్లు వెల్లడించింది.

ఇప్పటివరకు ఇటలీలో 19.53 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి వల్ల తొలినాళ్లల్లోనే ఇటలీ తీవ్రంగా దెబ్బతింది. ఓ దశలో కరోనాకు హాట్​స్పాట్​గా మారింది. రోజుకు వేలల్లో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటికీ రోజుకు 15 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

70శాతం అధికంగా వ్యాప్తి

బ్రిటన్​లో కొత్త రకం కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే ఈ కొత్ తరకం వైరస్‌ను గుర్తించినట్లు బ్రిటన్ అధికారులు చెబుతున్నారు. సాధారణ వైరస్​తో పోలిస్తే కొత్తరకం కరోనా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. ఈ వైరస్‌ను వాక్సిన్‌ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ మరింత ప్రమాదకరంగా ఉంటుందా లేదా అన్న విషయంపైనా స్పష్టత లేదు.

ఇదీ చదవండి:కొత్తరకం కరోనాపై ప్రపంచ దేశాల కలవరం!​

ఈ తరహా వైరస్​ కేసులు ఇతర ప్రాంతాలకు పాకుతుందన్న భయాల మధ్య ప్రపంచదేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా, ఇటలీ, ఐర్లాండ్, బల్గేరియా దేశాలు బ్రిటన్​ నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఆ దేశం నుంచి వచ్చే ప్యాసింజర్ విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు కెనడా సైతం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details