ఇటలీలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. వైరస్ ధాటికి ఇప్పటివరకు 200 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. మరో 6వేల మంది వైరస్ బారిన పడినట్టు స్పష్టం చేశారు.
ఇటలీలోని లాజియో ప్రాంతం గవర్నర్ నికోలా జింగరెట్ట్కు వైరస్ లక్షణాలున్నట్టు తేలడం స్థానికులను తీవ్ర కలవరపరిచింది. అయితే తనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆయన చెప్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఇటలీ ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకరి నుంచి మరొకరు కనీసం ఒక మీటర్ దూరం అయినా ఉండాలని స్పష్టం చేసింది. దీనిని ఆ దేశంలోని అనేకమంది పాటించడం ప్రారంభించారు.