వ్యాక్సిన్ తొలిడోసు వేసుకున్నవారిలో ఐదు వారాల తర్వాత కరోనా సోకే ప్రమాదం 80 శాతం మేర తగ్గిందని ఇటలీ పరిశోధన సంస్థ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ఇటలీలో గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ నెల 3 వరకు ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకా తొలి డోసు తీసుకున్న వారిని పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. దాదాపు కోటీ 40 లక్షల మందిని పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు.
తొలి డోసు తర్వాత కరోనా సోకే అవకాశం తక్కువే!
కరోనా టీకా తొలిడోసు తీసుకున్న తర్వాత కొవిడ్ సోకే అవకాశం తక్కువగా ఉందని ఇటలీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తెేలింది. గతేడాది డిసెంబర్ 27 నుంచి మే 3 వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారిని పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు శాస్త్రవేత్తలు.
ఇటలీ కొవిడ్, కరోనా టీకా
"తొలి డోసు వేసుకున్న 35 రోజులకు కరోనా సోకే శాతం 80కి, ఆసుపత్రుల పాలయ్యే శాతం 90కి, మరణాల శాతం 95కి తగ్గింది" అని శాస్త్రవేత్తలు తెలిపారు.
Last Updated : May 17, 2021, 6:50 AM IST