Fake Arm for Vaccine: అతడు ఓ దంత వైద్యుడు. వ్యాక్సిన్ తీసుకోనందుకు ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు అధికారులు. టీకా వేసుకోవడం ఇష్టం లేని ఆ వ్యక్తి.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఎలాగైనా పొందేందుకు ఓ ప్లాన్ వేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇటలీలోని బియెల్లాలో జరిగిందీ ఘటన.
ఆరోగ్య సిబ్బంది కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధన ఇటలీలో అమల్లో ఉంది. సంబంధిత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను చూపిస్తేనే ఉద్యోగం ఉంటుంది.
కానీ.. టీకా తీసుకోవడం ఇష్టం లేక సస్పెండ్ అయిన ఓ ఆరోగ్య కార్యకర్త వినూత్నంగా ఆలోచించాడు. భుజం చుట్టూ సిలికాన్‌తో చేసిన నకిలీ భుజాన్ని అతికించుకొని టీకా వేయించుకునేందుకు వెళ్లాడు.
నర్స్ చొక్కా ఎత్తి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె చేతికి అతడి భుజం రబ్బర్లాగా, చల్లగా తగిలింది. అనుమానంతో అక్కడ ఇంకాస్త గట్టిగా రుద్దగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం బయటకు పొక్కకుండా నర్స్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె అధికారులకు ఫిర్యాదు చేసింది.
Dentist in Italy faces Possible Criminal Charges