తెలంగాణ

telangana

ETV Bharat / international

వ్యాక్సిన్ తయారీ​ అంత ఈజీ కాదు...! - కరోనా వైరస్​

కరోనాకు వ్యాక్సిన్​ తయారీ ఆలస్యం అవ్వొచ్చని, పరిస్థితులు సరిగ్గా లేకపోతే అసలు వ్యాక్సిన్​ కనుక్కోవడమే కష్టమని డబ్ల్యూహెచ్​ఓ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికీ టీకాలు కనుగొనలేని వైరస్​లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు.

IT IS NOT EASY TO DEVELOP A VACCINE, SAYS WHO
వ్యాక్సిన్ తయారీ​ అంత ఈజీ కాదు...!

By

Published : May 6, 2020, 9:25 AM IST

కరోనాకు వ్యాక్సిన్‌ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. కొన్ని వ్యాక్సిన్‌లు క్లినికల్‌ దశ నుంచి మనుషులపై ప్రయోగాల దశకూ చేరుకుని ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టడం బాగా ఆలస్యం అవ్వొచ్చని, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అసలు తయారీనే సాధ్యం కాకపోవచ్చునని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి, లండన్‌లోని ఇంపీరియల్‌ కళాశాల ప్రొఫెసర్‌ డేవిడ్‌ నబార్రో సందేహాన్ని లేవనెత్తారు. ఇప్పటికీ టీకాలు కనుగొనలేని వైరస్‌లు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పటికి సాధ్యమవుతుందనే విషయంలో నిర్ధిష్టమైన అభిప్రాయానికి రాలేమని, పటిష్ఠ భద్రతా ప్రమాణాల మధ్య అన్ని రకాల పరీక్షలూ పూర్తి చేసుకున్న తర్వాతే అందుబాటులోకి వస్తుందని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ డేవిడ్‌ నబార్రో వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details