కొవిడ్ నివారణకు వినియోగించే ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని ఐర్లాండ్ తాత్కాలికంగా నిలిపివేసింది. నార్వేలో టీకా తీసుకున్న వారికి రక్తంలో సమస్యలు ఎదురైన ఘటనలు వెలుగు చూడగా.. ఈ నిర్ణయం తీసుకుంది.
నార్వేలో ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న నలుగురిలో సమస్యలు ఎదురయ్యాయని ఐర్లాండ్ వైద్య శాఖ అధికారి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకా పంపిణీని తమ దేశంలోనూ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
నెదర్లాండ్స్‌లోనూ..
నెదర్లాండ్స్‌లోనూ ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. డచ్ ఔషధ నియంత్రణ బోర్డు హెచ్చరికలతో ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకా పంపిణీని మార్చ్ 28 వరకు ఆపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే.. డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ సహాఐరోపా సమాఖ్యలోని చాలా దేశాలు ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశాయి.