టీకా వేసిన తర్వాత రక్తం గడ్డ కట్టినట్లు నివేదికల నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేస్తున్న దేశాల జాబితా పెరుగుతోంది. తాజాగా ఆ జాబితాలోకి ఐర్లాండ్ కూడా చేరింది. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న తర్వాత నలుగురికి రక్తం గడ్డ కట్టినట్లు నార్వే మెడికల్ ఏజన్సీ నివేదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐర్లాండ్ అధికారులు చెప్పారు.
ఐర్లాండ్లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేత - Ireland suspends AstraZeneca vaccine
ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఐర్లాండ్ తెలిపింది. టీకా వేసుకున్న తర్వాత రక్తం గడ్డ కట్టిందన్న నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రక్తం గడ్డకట్టడానికి, టీకాకు సంబంధం లేకపోయినా ముందుజాగ్రత్తగా చర్యగా వ్యాక్సినేషన్ నిలిపివేసినట్లు పేర్కొంది.
ఐర్లాండ్లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేత
ఈ కేసులతో టీకాకు సంబంధం ఉన్నట్లు స్పష్టం కానప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సినేషన్ నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్ దేశాలూ ఇదే తరహా చర్యలు తీసుకున్నాయి. రక్తం గడ్డకట్టడానికి టీకాకు సంబంధం లేదని డబ్ల్యూహెచ్ఓ సహా ఐరోపా సమాఖ్య ఔషధ క్రమబద్ధీకరణ సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
ఇదీ చూడండి:ఆస్ట్రేలియా 'మిస్టరీ ఫ్లైట్' గురించి మీకు తెలుసా?