ఐర్లాండ్ ప్రధాన మంత్రి లియో వరద్కర్ మహారాష్ట్రలోని తన సొంతూరుకు వచ్చారు. సింధుదుర్గ్ జిల్లా మాల్వన్ తాలూకా వరద్గావ్కు కుటుంబ సమేతంగా ఆదివారం చేరుకున్నారు. గ్రామస్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. స్థానికుడు శ్రీ దేవ్ వెటోబా ఇంటిని సందర్శించారు. తన బంధువైన మాల్వానీ ఇంట్లో భోజనం చేశారు ఐర్లాండ్ ప్రధాని.
భారత్‌లోని సొంతూరుకు వచ్చిన ఐర్లాండ్ ప్రధాని - Ireland PM Leo Varadkar visit latest news
ఖండాంతరాలు దాటినా తండ్రి పుట్టిన ఊరిని మరిచిపోలేదు. ఒక దేశానికి ప్రధాని అయినా మూలాల్ని విడిచిపెట్టలేదు. దశాబ్దాల తర్వాత సొంతూరుకు వచ్చి, బంధువులతో కాసేపు సరదాగా గడిపారు ఐర్లాండ్ ప్రధాని. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు.
భారత్‌లోని సొంతూరుకు వచ్చిన ఐర్లాండ్ ప్రధాని
లియో తండ్రి అశోక్ వరద్కర్... వృత్తిరీత్యా వైద్యుడు. 1960లో ఆయన ఐర్లాండ్‌కు వలస వెళ్లారు. అక్కడి మహిళను వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు లియో... ఐర్లాండ్‌లోని ప్రముఖ రాజకీయ పార్టీ అయిన ఫైన్ గేల్‌కు నేతృత్వం వహిస్తున్నారు. 2017 జూన్‌లో ప్రధానిగా ఎన్నికయ్యారు.
Last Updated : Dec 30, 2019, 10:56 PM IST