తెలంగాణ

telangana

ETV Bharat / international

'బ్రిటిష్ ట్యాంకర్​కు ఇరాన్ ఓడల ఆటంకం'

బ్రిటిష్​ చమురు ఓడ​ గల్ఫ్ జలాల్లో ప్రయాణిస్తుండగా ఇరాన్​ ఓడలు ఆటంకం కల్గించాయని బ్రిటన్ ప్రభుత్వం ఆరోపించింది. తమ యుద్ధనౌక జోక్యంతో ఓడలు అడ్డు తప్పుకున్నట్లు పేర్కొంది.

'బ్రిటిష్ ట్యాంకర్​కు ఇరాన్ ఓడల ఆటంకం'

By

Published : Jul 11, 2019, 8:00 PM IST

గల్ఫ్​ జలాల్లో ప్రయాణిస్తున్న బ్రిటిష్​ చమురు ఓడకు ఇరాన్​ ఓడలు ఆటంకం తలపెట్టాయని బ్రిటన్​ ప్రభుత్వం ఆరోపించింది. అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా మూడు ఇరానియన్ ఓడలు బ్రిటిష్ హెరిటేజ్ వాణిజ్య నౌకను అడ్డుకున్నాయని తెలిపింది. హొర్ముజ్ జలసంధి వద్ద బుధవారం ఘటన జరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది.

యుద్ధ నౌక జోక్యం చేసుకుని ఇరాన్ ఓడలు అడ్డుతప్పుకోవాలని హెచ్చిరించాక అవి వెనుదిరిగాయని పేర్కొంది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇరాన్​ ప్రభుత్వానికి సూచించినట్లు బ్రిటన్​ తెలిపింది.

హొర్ముజ్​ జలసంధి వద్ద చమురు నౌకలపై గతంలో దాడులు జరిగాయి. దాడి చేసింది ఇరాన్ దేశమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించగా.. ఇరాన్​ ఖండించింది.

ఇదీ చూడండి: 'గ్రీన్​కార్డ్ బిల్లు'కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details