తెలంగాణ

telangana

ETV Bharat / international

ముక్కు ద్వారా ఇచ్చే టీకాతో కరోనా ఖతం! - ముక్కు ద్వారా కరోనా టీకా

ముక్కు ద్వారా వేసే టీకా.. కరోనాను సమర్థంగా ఎదుర్కొంటుందని బ్రిటన్​ శాస్త్రవేత్తలు చేపట్టిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్​కు సంబంధించి ఎలుకలపై నిర్వహించిన క్లినికల్​ పరీక్షల్లో ఈ మేరకు తేలింది.

nasal vaccine
ముక్కు ద్వారా ఇచ్చే టీకా

By

Published : Aug 11, 2021, 5:47 PM IST

ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్.. కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన లాన్‌కాస్టర్‌ యూనివర్సిటీకి శాస్త్రవేత్తల బృందం ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ను ఎలుకలపై చేసిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ విషయం బహిర్గతమైంది.

పునరుత్పత్తి జరగలేదు..

వ్యాక్సిన్‌ రెండు డోసులను ఎలుకలకు ముక్కు ద్వారా ఇచ్చి.. అనంతరం ఆ ఎలుకల్లోకి వైరస్‌ను పంపించినట్లు పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా వల్ల ఎలుకల్లో వైరస్‌ను ఎదుర్కొనే విధంగా రోగనిరోధక శక్తి పెరగడం సహా ముక్కులోగాని, ఊపిరితిత్తుల్లోగాని వైరస్‌ పునరుత్పత్తి జరగలేదని వెల్లడించారు. వాటిలో ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, ఇతర వైరస్‌ ప్రభావిత సమస్యలు ఏవీ కనిపించలేదని చెప్పారు.

మనుషుల్లో వినియోగం కోసం ఒక ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ రిజిస్టర్‌ చేసి ఉందన్న శాస్త్రవేత్తల బృందం.. ఇది వైరస్‌ ఎదుర్కొవడంలో అత్యంత సమర్ధవంతగా పని చేస్తుందని ఇప్పటికే రుజువైందని వెల్లడించారు.

ఇదీ చూడండి:ప్రపంచంపై 'డెల్టా' పడగ- ఇండోనేసియాలో వైరస్​ విలయం

ఇదీ చూడండి:'భారత్ బయోటెక్​ నుంచి త్వరలోనే చుక్కలమందు టీకా'

ABOUT THE AUTHOR

...view details