అంతర్జాలం మహిళల కోసం పనిచేయడం లేదన్నారు వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త టిమ్ బెర్నర్స్ లీ. కానీ అదే ఇంటర్నెట్ ఆడపిల్లలపై వివక్షకు మరింత ఆజ్యం పోస్తోందని హెచ్చరించారు. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్ చేసిన సర్వేను ఊటంకిస్తూ బెర్నర్స్ లీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"వెబ్ మహిళలు, బాలికల కోసం పనిచేయడం లేదు. సగానికి పైగా మహిళలు, బాలికలు ఆన్లైన్ హింసకు గురవుతున్నారు. ముఖ్యంగా రంగు, రూపం ఆధారంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎల్జీబీటీక్యూ, ఇతర అట్టడుగు వర్గాల పురోగతికి కూడా ఇది అవరోధంగా నిలుస్తోంది."- టిమ్ బెర్నర్స్ లీ, వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త