భారత్‌లో రెండో దశ కరోనా విలయం అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు, మరణాలతో పాటు కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరుతున్న ఘటనలు పెరిగి పోతున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి దశతో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా రెండోదశ మరీ ప్రాణాంతమని వ్యాఖ్యానించారు.
భారత్‌లో కరోనా కట్టడి కోసం డబ్ల్యూహెచ్ఓ కూడా సమర్థంగా పనిచేస్తోందని వివరించారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, టెంట్లు, క్షేత్రస్థాయి ఆస్పత్రుల నిర్వహణ, మాస్కులు, మెడికల్ పరికరాలు, ఔషధాల పంపిణీ చేపడుతున్నట్లు టెడ్రోస్ తెలిపారు. కష్టకాలంలో భారత్‌కు అండగా ఉన్న అంతర్జాతీయ సమాజానికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.