తెలంగాణ

telangana

ETV Bharat / international

'బి.1.617.2 వైరస్​ అత్యంత ప్రమాదకరం కాకపోవచ్చు' - బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

భారత్ లో ఉత్పరివర్తనం చెందిన బి.1.617.2 రకం కొవిడ్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది కాకపోవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ రకం వ్యాప్తిని అరికట్టడంలో టీకాలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయని విశ్లేషించారు.

indian variants transmissibility might be smaller than feared
బి.1.617.2 సంక్రమణ సామర్థ్యం అంచనా కంటే తక్కువే

By

Published : May 20, 2021, 9:52 AM IST

భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం బి.1.617.2 కరోనా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనదేమి కాకపోవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వైరస్‌ సంక్రమణ సామర్థ్యం మొదట భయపడిన దానికంటే తక్కువేనని పేర్కొన్నారు. కానీ, ఈ రకం కరోనా వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్‌ల సామర్థ్యం కాస్త తక్కువగా ఉండవచ్చని బ్రిటన్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా ధాటికి వణికిపోయిన బ్రిటన్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. ఇప్పటికే అక్కడ దాదాపు 70శాతం మంది తొలి డోసు తీసుకోగా, వీరిలో 36శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దీంతో సుదీర్ఘకాలం కొనసాగిన కొవిడ్‌ ఆంక్షలను సడలించేందుకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రణాళికలు రూపొందించారు. ఇదే సమయంలో భారత్‌లో వెలుగుచూసిన బి.1.617.2 వైరస్‌ వ్యాప్తి బ్రిటన్‌ను ఆందోళనకు గురిచేసింది. దీంతో అప్రమత్తమైన అక్కడి నిపుణులు.. ఈ రకం వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, ముందుగా భయపడిన దానికంటే భారత్‌ రకానికి సంక్రమణ ప్రభావం తక్కువగానే ఉన్నట్లు బ్రిటన్‌ ఎపిడమాలజిస్ట్‌లు అంచనా వేశారు.

"ఈ రకం వేరియంట్‌ వృద్ధి గణనీయంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఉన్న అంచనాలతో పోలిస్తే వీటి ప్రభావం తక్కువగానే ఉంది. అందుచేత వైరస్‌ ప్రభావం భయపడినంతగా ఉండకపోవచ్చని ఆశిస్తున్నాం" అని ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌కు చెందిన ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ నీల్‌ ఫెర్గూసన్‌ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కెంట్‌ వేరియంట్‌ (బ్రిటన్‌ రకం) కంటే ఎక్కువగా ఉందా? లేదా తక్కువగా ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మరింత డేటా అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రయాణాలు చేసిన వారికి, భిన్న గృహసముదాయాల్లో ఉన్నవారితో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. వైరస్‌ విస్తృతికి ఈ రకం కారణమని చెప్పలేమన్నారు.

కరోనా వైరస్‌ కొత్తరకాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే విశ్వాసం ఉన్నప్పటికీ.. వ్యాక్సిన్‌ పొందిన వారిలోనూ బి.1.617.2 రకం సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇన్‌ఫెక్షన్‌, వైరస్‌ సంక్రమణను తగ్గించడంలో టీకా సామర్థ్యం కాస్త తక్కువగానే ఉన్నట్లు ఇప్పటివరకు వచ్చిన సమాచారం సూచిస్తోంది. అయితే, వీటిని కచ్చితంగా ధ్రువీకరించేందుకు మరికొంత సమాచారం అవసరమని బ్రిటన్‌ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుల్లో ఒకరైన ఫెర్గూసన్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఎక్కువ మందికి టీకా అందితే మాస్క్​ పక్కన పెట్టొచ్చా?

ABOUT THE AUTHOR

...view details