భారత సంతతి విద్యార్థిని దివ్య విన్సెంట్ 12 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించింది. ఇంగ్లాండ్ కెంట్ ప్రాంతంలోని సెనెనోయక్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోన్న దివ్య.. తన ప్రాజెక్టుతో జీఎస్కే యూకే యంగ్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకుంది.
'మైక్రోగ్రీన్స్ ఫ్రమ్ గోల్డ్‌ఫిష్'అనే ప్రాజెక్టుగానూ ఈ అవార్డు లభించింది. సూక్ష్మహరిత మొక్కలుగా, మైక్రోగ్రీన్స్‌గా పిలుచుకునే మొక్కలను అక్వేరియంలోని నీటితో పెంచింది దివ్య. వీటిని మరో మూడు పద్ధతుల్లో పెంచిన వాటితో పోల్చి చూసి.. దివ్య చేసిన ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఈ టైటిల్‌తో పాటు చిన్నారికి ప్రైజ్ మనీ కింద రూ. 1,87,813 అందాయి.