తెలంగాణ

telangana

ETV Bharat / international

స్కాట్లాండ్​ ఎంపీగా భారతీయ మూలాలున్న వ్యక్తి - స్కాట్లాండ్​ ఎంపీ తాజా

స్కాట్లాండ్​లో ఎంపీగా మహారాష్ట్రలోని అమరావతికి చెందిన డాక్టర్​ సందేశ్​​ గుల్హానే ఎన్నికయ్యారు. స్కాటిష్ పార్లమెంటుకు​ భారతీయ మూలాలున్న వారు ఎన్నిక కావటం ఇదే ప్రథమం.

scotland
స్కాట్లాండ్

By

Published : May 17, 2021, 6:33 AM IST

మహారాష్ట్రలోని అమరావతికి చెందిన డాక్టర్​ సందేశ్​ గుల్హానే స్కాట్లాండ్​లో ఎంపీగా ఎన్నికై అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకు భారతీయ మూలాలున్నవారిలో ఎవరూ స్కాటిష్​ పార్లమెంటుకు ఎన్నిక కాలేదు.

గుల్హానే తల్లిదండ్రులు ప్రకాశ్​, పుష్పాల స్వస్థలం అమరావతి. వారు లండన్​లో ఉండేవారు. అక్కడే పుట్టిన సందేశ్​ గుల్హానే.. వృత్తిరీత్యా ఎముకల వైద్యుడు. వైద్య రంగంలో మంచి పేరు పొందడం సహా సామాజిక సేవలు అందిస్తూ క్రమంగా రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details